సర్పంచ్ ను ప్రశ్నించిందని ముక్కు కోసేశాడు!

Telugu Lo Computer
0


బీహార్ లోని సుపాల్ జిల్లాకు చెందిన లోధ్ గ్రామానికి సర్పంచ్ ముస్తాకిన్. సాధారణంగా సర్పంచ్ అన్నంతనే గ్రామానికి పెద్ద. అందరి బాధల్ని.. కష్టాల్ని తనవిగా ఫీల్ అవుతూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. కానీ ముస్తాకిన్ తీరు కాస్త భిన్నం. తమ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల్ని వేధిస్తున్నాడు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో.. అతడి వేధింపుల్ని భరించలేని వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఊహించని పరిణామానికి తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ ధర్నా చేస్తున్న ముగ్గురు అమ్మాయిల మీద దాడి చేశారు. అంతేకాదు తమకు న్యాయం చేయమని కోరిన దానికి మండిపడుతూ ధర్నా చేస్తున్న ముగ్గురిలో ఒక అమ్మాయి ముక్కు కోసేశాడు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్నారు. గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ముక్కు కోసిన సర్పంచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబానికి చెందిన వారు. ఇదిలా ఉంటే.. తన మీద కంప్లైంట్ చేసిన మహిళ కుటుంబం మీద సర్పంచ్ తిరిగి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి మీదకు దాడి చేసినట్లుగా అందులో పేర్కొన్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)