కార్బెవాక్స్‌కు టీకా కు డీసీజీఐ అనుమతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 February 2022

కార్బెవాక్స్‌కు టీకా కు డీసీజీఐ అనుమతి


12-18 ఏళ్ల పిల్లలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్​-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్​ అత్యవసర అనుమతికి డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు ఇచ్చింది. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్​ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్​కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బెవాక్స్ రికార్డులకెక్కింది. బయోలాజికల్‌-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్‌ పెట్టింది. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ అయిన కార్బెవాక్స్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే ఈ టీకాకు అనుమతులు రాకముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం బయోలాజికల్‌-ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 1500కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందంలో భాగంగానే డోసుల కొనుగోలుకు ఇటీవల ఆర్దర్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment