ఐదు నిమిషాల్లో పళ్లు తెల్లగా మెరుస్తాయి! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 February 2022

ఐదు నిమిషాల్లో పళ్లు తెల్లగా మెరుస్తాయి!


ఈ మధ్య కాలంలో చాలా మంది దంతాల పట్ల శ్రద్ద పెట్టటం లేదు. ఏదో పళ్ళు త్వరత్వరగా తోముకొని పనుల్లో పడుతూ ఉంటారు. దాంతో పళ్లపై పాచి పెరగటమే కాకుండా పసుపు రంగులోకి మారతాయి. పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా మెరవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఖరీదైన క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు. ఒక టీస్పూన్ రాక్ ఉప్పు, ఒక టీస్పూన్ లవంగం పొడి, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ అతి మధురం పొడి, 15 ఎండిన వేప ఆకులు మరియు 15 ఎండిన పుదీనా ఆకులు సరిపోతాయి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఒక స్పూన్ పొడిని అరచేతిలో వేసుకుని, బ్రష్‌ని ఉపయోగించి దంతాలను పౌడర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే దంతాల మీద పాచి,పసుపు రంగు అన్నీ తొలగిపోతాయి. ఎక్కువసేపు లేదా చాలా గట్టిగా బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఇది పంటిని కప్పి ఉంచే బయటి కవరింగ్‌ను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడైనా ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో దంతాలు శుభ్రం అవ్వటమే కాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండి చిగుళ్ళ సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి.

No comments:

Post a Comment