విజయ్, రష్మిక పెళ్లిపీట లెక్కబోతున్నారా ?

Telugu Lo Computer
0


తొలిసారి విజయ్, రష్మిక 'గీత గోవిందం' సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్, రష్మిక అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. 'డియర్ కామ్రేడ్' చిత్రంతో మరోసారి కలిసి ఈ జంట నటించింది. కొంతకాలంగా రష్మిక విజయ్ కుటుంబానికి చాలా దగ్గరయింది. దేవరకొండ ఫ్యామిలిలో జరిగే ప్రతి ఫంక్షన్ కు రష్మిక హాజరవుతోంది. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు దేవరకొండ బ్రదర్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది. ఈ జంట ముంబైలో తరచూ డేటింగ్ కు, షాపింగ్ కు వెళ్తున్నారు. ఇటీవల రష్మిక ముంబైలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది చివర్లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. అయితే రష్మిక కానీ, విజయ్ కానీ ఇప్పటి వరకు తమ రిలేషన్ షిప్ గురించి నోరు విప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్'  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. మరోవైపు రష్మిక నటిస్తున్న హిందీ చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. శర్వనంద్ తో రష్మిక నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే అల్లు అర్జున్ తో పుష్ప 2లో చేయనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)