చిరుతపులిని కరిచిన కొండచిలువ?

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాములు, పులులు, సింహాలు వంటి యానిమేల్స్ వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా సింహాలు, పులులు, చిరుతపులులు వంటి జంతువులు పాములను వేటాడడం చాలా అరుదు. తాజాగా అలాంటి రేర్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ''నది ఒడ్డున చిరుతపులి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఆ నీటిలో ఓ కొండ చిలువను చూస్తోంది. వెంటనే నోటితో దాని తోకను పట్టుకుంటుంది. ఇంతలో కొండ చిలువ సడన్ గా చిరుత కాలును కరుస్తుంది. దీంతో చిరుత కోపంతో కొండ చిలువను నోటితో కరుచుకుని..పారిపోతుంది''. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)