ఆస్ట్రేలియా విమానంపై చైనా లేజర్ ప్రయోగం ?

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియా విమానం పై చైనా నౌక లేజర్ ను ప్రయోగించిందంట!. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఇది కచ్చితంగా రెచ్చగొట్టే చర్యేనని ఆయన అన్నారు. చైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఆస్ట్రేలియాకు చెందిన పీ-8ఏ పొసైడాన్‌ నిఘా విమానంపై లేజర్‌ను ప్రయోగించినట్లు ఆస్ట్రేలియా రక్షణ శాఖ గుర్తించింది. పీఎల్‌ఏకు చెందిన రెండు నౌకలు టోరస్‌ జలసంధిని దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు జరిగింది. లేజర్‌ ప్రభావంతో పైలట్లు గందరగోళానికి గురికావడం కానీ, తాత్కాలికంగా వారి కంటి చూపు దెబ్బతినడంకానీ జరుగుతుందని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకపోవటం మంచిదైందని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్‌ డట్టోన్‌ అన్నారు. ''ఇదొక ప్రమాదకర చర్య. చైనా దూకుడు చర్యలపై ఎవరూ మాట్లాడకూడదని బీజింగ్‌ భావిస్తున్నట్లుంది'' అని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం అమెరికా నిఘా విమానంపై కూడా చైనా లేజర్లను వాడినట్లు ఆరోపణలున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)