సన్ ఆఫ్ ఇండియా కి కలెక్షన్స్ పరాభవం!

Telugu Lo Computer
0


మోహన్ బాబు తాజాగా సన్ ఆఫ్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఈ సినిమా చేసాడు. మంచు విష్ణు ఈ సినిమాను తన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించాడు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన సన్ ఆఫ్ ఇండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. సాధారణంగా సినిమాలు ప్లాప్ అవడం కామన్. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కొన్ని అయినా కలెక్షన్స్ వస్తుంటాయి. రెండో రోజు నుంచి పడిపోతుంటాయి. కానీ సన్ ఆఫ్ ఇండియా విషయంలో మాత్రం మొదటి రోజు మొదటి షో నుంచే తిరస్కరణ కనిపించింది. తెలుగు ఇండస్ట్రీలో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా మరోటి లేదనే చెప్పాలి. ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి. కనీసం ఒక్క రూపాయి కూడా షేర్ తీసుకురాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకొచ్చిన ఘటన సన్ ఆఫ్ ఇండియాకే చెల్లింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 6 లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే షేర్ లెక్కలేస్తే రెంట్ కాదు కదా పార్కింగ్ డబ్బులు కూడా రానట్లే. అంత దారుణంగా పడిపోయింది. ప్రేక్షకులు థియేటర్స్‌కు రాక.. జనం లేక చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసారు. ఇక రెండో రోజుకు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. లక్షల నుంచి గ్రాస్ కూడా వేలల్లోకి పడిపోయిందని తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో మాత్రమే మొదటి రోజు 25 వేల షేర్ రాగా.. రెండో రోజు 10 వేల వరకు వచ్చిందని తెలుస్తుంది. మిగిలిన చోట్ల కనీసం షేర్ కాదు కదా ఏం రావట్లేదనేది బయ్యర్ల వాదన కూడా. రెండో రోజు ఎక్కడా సన్ ఆఫ్ ఇండియాకు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించలేదు. ఒప్పుకోడానికి కాస్త కష్టంగానే అనిపించినా మోహన్ బాబు కెరీర్‌లో ఇంత కంటే పెద్ద డిజాస్టర్ లేదు.. ఇక రాదేమో కూడా. నాలుగేళ్ల కింద గాయత్రి విడుదలైనపుడు కనీసం 60 లక్షల షేర్ అయినా వచ్చింది.. ఇప్పుడు అందులో 10వ వంతు అంటే కనీసం 6 లక్షల షేర్ కూడా రావడం లేదంటూ విశ్లేషకులు చెప్తున్న మాట. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు భార్యగా మీనా నటించింది. తమపై ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై మంచు కుటుంబం కూడా సీరియస్ అయింది. వాళ్లపై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. మొత్తానికి సన్ ఆఫ్ ఇండియా నెగిటివ్ షేర్స్ విషయంలో సరికొత్త చరిత్రకు తెరతీసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)