వాకింగ్ ఎంతసేపు చేయాలి? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 February 2022

వాకింగ్ ఎంతసేపు చేయాలి?


శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు అయితే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వాకింగ్ పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. వాకింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా వాకింగ్ చేస్తే జనసంచారం ఎక్కువగా ఉండటంతో విష వాయువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఆరోగ్యం సంగతి అటుంచితే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరంలో డి విటమిన్ తక్కువగా ఉండేవారు ఉదయం 8 గంటల లోపు ఎండలో నిలబడాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ఉదయం కుదరని వారు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండలో నిలబడొచ్చు. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం వాకింగ్ చేస్తారు. రోజూ నిర్ధారిత సమయంలో నడవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు. అంటే సుమారు 2.5 గంటలు వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. నడవమన్నారు కదా అని బద్దకంగా అడుగులు వేయకండి. వీలైనంత చురుగ్గా శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. వాకింగ్ ప్రతి రోజూ చేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. వర్షాల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బయట వాకింగ్ చేయడం కుదరకపోతే ఇంట్లోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి.


No comments:

Post a Comment