ఆ ముగ్గురు నన్ను ఆగం చేశారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 February 2022

ఆ ముగ్గురు నన్ను ఆగం చేశారు !


తెలంగాణలోని మహబుబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్ వరకు చదివిన ఆమె తల్లి చనిపోవడంతో చదువును ఆపేసి పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది. కాగా తండ్రి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. యువతి ఈ నెల 16 తన స్నేహితురాలి ఇంటికి పడుకునేందుకు వెళ్లి తిరిగి ఉదయం ఇంటికి చేరుకుంది. మళ్లి 17వ తేదిన రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి వెళ్లి వెంటనే బయటికి వచ్చింది. కాని ఇంటికి మాత్రం రాత్రి రెండు గంటలకు చేరుకుంది. ఏం జరిగిందో ఏమో కాని 18 వతేది ఉదయం లేచి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ బయటకు రావడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా అనే అనుమానాలు బలపడ్డాయి. సూసైడ్ నోట్‌లో గ్రామానికి చెందిన ముగ్గురు యువకుల పేర్లు రాసి వారు తనను ఆగం చేశారని పేర్కోంది. నా బాధ ఎవరికి చెప్పుకోలేక పోతున్నట్టు తెలిపింది. వాళ్లని చెప్పుతీసుకుని కొట్టాలి అంటూ పేర్కొంది. కాగా ఆమెపై అత్యాచారం చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటీసి భర్త కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు యువకులు కూడా స్థానికంగా లీడర్‌గిరి చేస్తారని సమాచారం. పోలీసుల పరీశీలనలో కూడా ఆమెపై అత్యాచారం జరిగినట్టు తెలిపారు.

No comments:

Post a Comment