పెరిగిన వంటనూనెల ధరలు

Telugu Lo Computer
0


రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలుకాకముందు పామ్‌ ఆయిల్‌ ధర లీటర్‌కు రూ.135 ఉండగా.. ఇప్పుడు రూ.142కు చేరుకుంది. ఇక సన్‌ప్లవర్‌ ఆయిల్‌ ధర ఇంతకు ముందు రూ.142 ఉండగా, యుద్ధ పరిస్థితుల తర్వాత రూ.165కు చేరుకున్నది. మరోవైపు ఇదే అదునుగా వ్యాపారులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే హోల్‌ సెల్‌ మార్కెట్‌కు కంపెనీలు సరఫరా తగ్గించాయని ట్రేడర్లు అంటున్నారు. ఉక్రెయిన్‌-రష్యా వార్‌ ప్రారంభం కాగానే వంట నూనె ధరలను కంపెనీలు 8 శాతం వరకు పెంచాయని హోల్‌ సెల్‌ డీలర్లు చెబుతున్నారు. గత సంవత్సరం మన దేశం 1.89 మిలియన్‌ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచి వచ్చింది. మరో 10 శాతం ఆర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంది. నెలకు 2 నుంచి 3 లక్షల టన్నుల సన్‌ప్లవర్‌ నూనెను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ఇలా కొనసాగితే.. రానున్న రోజుల్లో వంట నూనె ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ నిపుణుల చెబుతున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వెంటనే వంటనూనెల ధరలను ట్రేడర్లు పెంచేశారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)