టాటా విద్యుత్ ప్లాంట్‌లో అంతరాయం

Telugu Lo Computer
0


ముంబైలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ కోత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టాటా పవర్ ప్లాంట్ లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా దక్షిణ ముంబై నుంచి చెంబూర్, గోవండి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ టాటా పవర్ ప్లాంట్ లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ములుంద్ – ట్రోంబే మధ్య MSEB 220 KV లైన్ కు విద్యుత్ నిలిచిపోయిందని అన్నారు. దీని కారణంగా సియోన్, మాతుంగ, పరేల్, దాదర్, CSMT, బైక్కుళ్ళ, చర్చిగేట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరం ఏర్పడిందని బీఎంసీ కమిషనర్ వివరించారు. విద్యుత్ సిబ్బంది అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారని ఆదివారం సాయంత్రానికి తిరిగి విద్యుత్ లైన్ పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ సమస్య కారణంగా అంధేరి చర్చిగేట్ మధ్య పశ్చిమ రైల్వేకు చెందిన ప్రధాన రైళ్లు, లోకల్ ట్రైన్స్ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. కాగా గతంలోనూ పలుమార్లు ముంబై నగరంలో భారీ ఎత్తున విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అక్టోబర్ 2020లో ముంబై వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. సైబర్ దాడులు జరిగి ఉంటాయని అంతా భావించారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ ఒక కమిటీని నియమించింది. అయితే విద్యుత్ అంతరాయానికి సైబర్ దాడులు కారణం కాదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)