మధుమేహం - పనస పొడి !

Telugu Lo Computer
0


చాప కింద నీరులా మధుమేహం వ్యాపిస్తూ వస్తోంది. డయాబెటిస్‌ రోగులు పచ్చి పసన పొడి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర గ్లైకోసైలేటెడ్‌ హిమోగ్లోబిన్ ( హెచ్‌బిఏ 1సి ) ను తగ్గిస్తుందని కొందరు పరిశోధకుల పలు అధ్యయనాల్లో కనుగొన్నారు. మధుమేహం జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం టైప్‌ 2 డయాబెటిస్‌ రోగుల్లో గ్లైసెమిక్‌ నియంత్రణను మెరుగు పరచడంలో ఈ పనస పౌడర్‌ యొక్క చికిత్సా సామర్థ్యం బయట పడింది. ఈ మధ్య కాలంలో ఈ పనస పొడి అన్ని ఆన్‌ లైన్‌ సైట్లలో అందుబాటులో ఉంటోంది.పచ్చి పనస కాయ పొట్టుు కూరలలో వాడటం అందరికీ తెలిసిందే. అయితే ఈ పనస పొడిని శ్రీలంక మరియు కేరళలో వండిన బియ్యానికి సాంప్రదాయక కూరగా వాడతారు. పిండి రూపంలో గ్రీన్ ఇడ్లీ, ఉప్మా లేదా రోటీ వంటి వివిధ రకాల రోజూ వారీ ఆహారాలతో కలపడం మరింత సులభంగా ఉంటుంది. భారత్‌ లో చాలా మంది తగినంత మేర పండ్లను, కూరగాయలను తీసుకోరు. దానికి బదులుగా రిఫైన్డ్‌ ప్రాసెస్డ్ చేసిన బియ్యం మరియు గోధుమలపై ఆధారపడతారు. ఒక చెంచా బియ్యం లేదా గోధుమ పిండిని పనసతో భర్తీ చేసినప్పుడు, కార్బోహైడ్రేట్‌ మోతాదు తగ్గుతుంది. ఇది వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో పెద్ద తేడాను మనం గుర్తించవచ్చు. కేలరీలు కూడా తగ్గుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి సాయపడుతుంది. అంతే కాకుండా మల బద్దకం సమస్యల ఉన్న వారికి ఉపయోగపడే పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారిలో లేదా రక్తంలో చక్కెరు నియంత్రించడంలో పస పౌడర్ సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి మరియు ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. పనస పౌడర్‌ ను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది. కార్బోహైడ్రేట్లను తగ్గించడానికి సాయపడుతుంది. బియ్యం, గోధుమతో పోలిస్తే తక్కువ స్థాయిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తికి ఇది బూస్టర్‌ గా పని చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)