మేఘం వన్నె చిరుత ప్రత్యక్షం!

Telugu Lo Computer
0


సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో నాగాలాండ్‌లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కనిపించింది. 2020 జనవరి-జూన్‌ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్‌లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుండటంతో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్‌లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్‌ కమ్యూనిటీ అటవీ ప్రాంతంలోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఎస్‌ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్‌ఐ పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)