మామిడి పూతపై తామర పురుగు దాడి ?

Telugu Lo Computer
0


మిరప రైతులను నిండా ముంచిన తామర పురుగు క్రమంగా కూరగాయ పంటలు, పండ్లతోటలపై అటాక్ చేస్తోంది. తాజాగా మామిడి పూతపై ఈ తామర పురుగు కనిపిస్తోందని రైతులు అంటున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని తోటల్లో దీని ఉనికిని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాల్లో కూడా ఈ తామర పురుగు జాడ కనిపించినట్లు ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. నల్ల తామర పురుగు గత ఏడాది నవంబర్ చివరిలో మిరప పంటల నుంచి మొదలైంది. దాదాపుగా 90 శాతం పంటలకు నష్టం కలగజేసింది. అదే పురుగు ఇప్పుడు మామిడి పంటలను ఆశిస్తుండటంతో మామిడి సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మిగతా జిల్లాల్లో ఈ తామర పురుగు వృద్ధి చెందితే ఈ ఏడాది తియ్యటి మామిడి పండ్లు లభించడం కష్టం అవుతుంది. తామర పురుగు తో మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ పురుగు నివారణకు అధికంగా పురుగుల మందు పిచికారి చేయవద్దని వ్యవశాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీని నివారణకు పసుపు రంగుతో కూడిన జిగురు అట్టలను పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)