భర్త చెవులు కోసిన భార్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 1 January 2022

భర్త చెవులు కోసిన భార్య


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండాకు చెందిన గుగులోత్ ​కోట్యాకు భార్య విజయ, పవన్, విజయ్​ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతని పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. పెద్ద కొడుకు పవన్​ పెండ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. కొంత కాలంగా మద్యానికి అలవాటు పడిన కోట్యా వ్యవసాయ పనులకు వెళ్లడం లేదు. భూమి విషయంలో కోట్యాకు అతని భార్య విజయకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెండ్లి చేసుకొని వేరుగా ఉంటున్న పెద్ద కొడుకు పవన్​కు భూమి ఎక్కడ రాసి ఇస్తాడోనని విజయ, ఆమె చిన్న కొడుకు అనుమానిస్తున్నారు. భూమి మొత్తం తన పేరు మీద రాయాలని విజయ కోట్యాను వేధిస్తుంది. కోట్యా చనిపోతే రూ. 5 లక్షల రైతు బీమా రావడంతోపాటు భూమి కూడా తన పేరు మీదకు వస్తుందన్న ఆశతో చిన్న కొడుకుతో కలిసి హత్య చేయాలని పధకం పన్నింది. తల్లికొడుకు కలిసి శుక్రవారం రాత్రి  కోట్యా కంట్లో కారం చల్లి విచక్షణా రహితంగా కొట్టారు. కత్తితో చెవులు కోశారు. భయంతో బాధితుడు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. హాస్పిటల్​లో చికిత్స తర్వాత కోట్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


No comments:

Post a Comment