సోదరితో కలిసి స్టెప్పులేసిన వధువు

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో తెగవైరల్ అవుతోంది. దీనిలో వధువుతోపాటు.. ఆమె సోదరి అందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసి నెటిజన్లు అమెజింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంటర్నెట్‌లో క్రేజీగా మారిన వైరల్‌ మారిన ఈ వీడియోలో సారా అలీ ఖాన్ చిత్రం అత్రంగి రేలోని చకా చక్‌ పాటకు డ్యాన్స్ చేశారు. వధువు, ఆమె సోదరి గాగ్రా డ్రెస్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇద్దరూ.. చేస్తున్న డ్యాన్స్, వారు వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)