కార్పొరేషన్‌గా రాజధాని అమరావతి ప్రాంతం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 3 January 2022

కార్పొరేషన్‌గా రాజధాని అమరావతి ప్రాంతం


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజధానిలోని 19 గ్రామాలను అమరావతి క్యాపిటల్‌ సిటీ కార్పొరేషన్‌గా మార్చనున్నారు. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను గుంటూరు కలెక్టర్‌ ఆదేశించారు. 

No comments:

Post a Comment