రేపటి నుంచి పొంగల్‌ కిట్‌ పంపిణీ

Telugu Lo Computer
0


సంక్రాంతి పండుగకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే పొంగల్‌ కానుక పంపిణీ మంగళ వారం నుంచి ప్రారంభంకానుంది. చెన్నై నగరంలో సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం 20 రకాల కిరాణా సరుకులతో కూడిన వస్తులతో కూడిన పొంగల్‌ కిట్‌ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే. మొత్తం రూ.1,088 కోట్లతో అర్హులైన 2 కోట్ల 15 లక్షల 48 వేల కుటుంబాలకు ఈ సంక్రాంతి కానుకలను పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మంగళవారం సచివాలయం లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం పొంగల్‌ కిట్లను స్వయం గా అందజేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కానుకల పంపిణీకి అధికారులు శ్రీకారం చుడతారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారా కొవిడ్‌ మార్గదర్శకాలకు లోబడి వీటిని పంపిణీ చేస్తారు. ఇందుకోసం టోకెన్లను పంపిణీ చేసి, అందులో పేర్కొన్న తేదీల్లోనే ఆయా ప్రాంతాల ప్రజలకు వీటిని అందించేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)