ఐదు రాష్ట్రాలలో మ్రోగిన ఎన్నికల నగారా

Telugu Lo Computer
0


ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవాలోని 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 28, ఉత్తరాఖండ్ లోని 70 సీట్లు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా ప్రతీ పోలింగ్ బూత్ లోనూ ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సంఖ్య 1500గా ఉండేది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 24.5 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. అభ్యర్ధులకు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అభ్యర్ధులపై నమోదైన క్రిమినల్ కేసుల్ని తప్పనిసరిగా టీవీ ఛానళ్లు, పత్రికల్లో బహిర్గతం చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సూచించారు. ఎన్నికల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర డోస్ వేయాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటికే కోవిడ్ రెండు డోసులు తీసుకోని వారికి ఆ మేరకు ముందుగా రెండు డోసులు పూర్తి చేస్తారు. అనంతరం బూస్టర్ డోస్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. కోవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సుశీల్ చంద్ర వెల్లడించారు. కోవిడ్ ధర్డ్ వేవ్ అంచనా వేసేందుకు జనవరి 15 వరకూ పాదయాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిషేధించింది. అభ్యర్ధుల గెలుపు తర్వాత సంబరాల్ని కూడా నిషేధించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)