గుర్మార్ మొక్క - ఉపయోగాలు

Telugu Lo Computer
0


గుర్మార్ మొక్క కు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్క ఆకులు, వేర్లు, కాండం అనేక వ్యాధులను నయం చేస్తాయి. గుడ్మార్ మొక్క ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అధేరోస్క్లేరోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మధుమేహం తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ మొక్క ఆకులను ఉదయం పరగడుపున తిని ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. ఇలా తాగడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఆ రోజంతా చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. ప్రతి రోజు ఈ ఆకులను నమిలి తింటే మధుమేహులకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆకులను తినడం వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కామెర్ల నివారణకు సహాయపడతాయి. ఇవి చర్మం పై తెల్ల మచ్చలను తొలగిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)