ఢిల్లీలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

Telugu Lo Computer
0


కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నిర్వహణను అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొంది. డీడిఎంఎ డిసెంబర్ 15, 2021 నాటి ఉత్తర్వుల ప్రకారం, అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు నిషేధించింది. ఢిల్లీ లో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని తెలిపింది. ఢిల్లీలోని ఎం సి టి లో క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ఎటువంటి అనుమతి లేదని తెలిపింది. సాంస్కృతిక కార్యక్రమాలు/సమావేశాలు/సమ్మేళనాలు జరగకుండా అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు,  డిసిపి లు చూసుకోవాలని పేర్కొంది. ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు డీడీఎంఏ గుర్తించదన్నారు. ఆంక్షలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు అలాగే అన్ని జిల్లాల డిసిపి లు వారి సంబంధిత ప్రాంతాల్లో సర్ప్రై తనిఖీలు/దాడులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)