ఆస్తి కోసం తల్లిపై దాడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మునిసిపల్ చైర్మన్ ఇంట్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మునిసిపల్ చైర్మన్ గా రఘు బాధ్యతలు చేపడితే తన తల్లి సరోజ వైసీపీ తరుఫున 25వ వార్డు కౌన్సెలర్ గా గెలుపొందారు. తాజాగా కౌన్సిలర్ సరోజ అనూహ్య రీతిలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. గత 3 నెలలుగా తన కుమారుడు రఘు ఆస్తి కోసం వేధిస్తున్నాడని సరోజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ ఇంటి కొచ్చి తల్లితండ్రులపై, కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసారు. తల్లిపై చిందులేసింది మునిసిపల్ చైర్మన్ రఘు కోపంతో ఊగిపోయి ఆమెను రోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన అమానుష ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు కుమారుడు రఘు మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని.., రక్షణ కల్పించాలని ఆమె జిల్లా ఎస్పీని వేడుకుంది. కొడుకు మున్సిపల్ చైర్మన్ కావటంతో పోలీసులు తమ గోడు పట్టించుకోవటంలేదని ఆ ఫిర్యాదులో ఆమె వివరించింది. తన తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై మున్సిపల్ చైర్మన్ రఘు స్పందించార. నా తల్లిదండ్రులు నా కుటుంబం నా పైన తప్పుడు కేసులు పెట్టారని.., నేను చేసింది ధర్మమో.. ఆధర్మమో పైన భగవంతుడు చూసుకుంటాడని సమాధానమిచ్చారు. తన తల్లిదండ్రులపై దాడి చేయకపోయినా పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)