పాకిస్తాన్ లో మహిళలను బట్టలువిప్పి కొట్టారు

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాప్‌లో దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక గుంపు ఒక యువకుడితో సహా నలుగురు మహిళల బట్టలు విప్పదీసి అర్దనగ్నంగా ఊరేగించి కొట్టారు.ఈ ఘటన లాహోర్‌ నగరానికి 180 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో చోటుచేసుకుంది. తాము కప్పుకోవడానికి ఒక గుడ్డ ముక్క ఉండనివ్వమని చుట్టుపక్కల ప్రజలకు మహిళలు విజ్ఞప్తి చేయడం వైరల్ వీడియోలో కనిపించింది, కాని జనం మహిళలను కర్రలతో కొట్టారు.బాధిత మహిళలు తమను వెళ్లనివ్వమని ఏడుస్తూ ప్రజలను అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గంటపాటు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించారు.ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు.ఈ ఘటనలో ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి మంగళవారం ట్వీట్‌లో తెలిపారు.''మేం దాహంతో ఉస్మాన్ ఎలక్ట్రిక్ స్టోర్ లోకి వెళ్లి వాటర్ బాటిల్ అడిగాం. కానీ షాపు యజమాని సద్దాం దొంగిలించారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. ఆపై వారు బట్టలు విప్పి కొట్టారు. మమ్మల్ని మార్కెట్‌ ప్లేస్‌లో తిప్పుతూ మా వీడియోలు కూడా తీశారు'' అని బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు దాడులు చేస్తున్నామని, సద్దాం సహా ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని ఫైసలాబాద్ పోలీస్ హెడ్ డాక్టర్ అబిద్ ఖాన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)