ఈ వ్యాధులు ఉన్నవారు క్యాబేజీ తినకూడదు!

Telugu Lo Computer
0


క్యాబేజీ తింటే ఆరోగ్యమే. ఎందుకంటే ఇందులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఎ, సి, కె వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేసే ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అవి ప్రాణాంతక రోగాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడతాయి. క్యాన్సర్ వంటి రోగాలను అడ్డుకోవడంలో ఈ ఫైటో న్యూట్రియెంట్లు సమర్థంగా పనిచేస్తాయి. క్యాబేజీ వల్ల అన్ని లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే సంపూర్ణ ఆరోగ్యవంతుడికి క్యాబేజీ వల్ల కలిగే సమస్యలు లేవు కానీ, కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి మాత్రం క్యాబేజీ తినడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో క్యాబేజీలోని పోషకాలు సహకరిస్తాయి. కానీ క్యాన్సర్ బారిన పడిన వారికి మాత్రం క్యాబేజీ వల్ల ఉపయోగం లేదు. వారు దీన్ని తినకూడదు. తింటే విరేచనాలు అధికంగా అయ్యే అవకాశం ఉంది. అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కూడా క్యాబేజీని దూరం పెట్టాలి. ఎందుకంటే ఇందులో రిఫినోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గ్యాస్ ను పెంచుతుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అందులోనూ ముఖ్యంగా హైపో థైరాయిడిజంతో బాధపడేవారు కూడా క్యాబేజీని దూరం పెట్టాలి. థైరాయిడ్ గ్రంథి పనితీరుపై క్యాబేజీ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీరు పూర్తిగా క్యాబేజీని తినడం మానేయాలి. విరేచనాలు అవుతున్నప్పుడు కూడా క్యాబేజీని తినకూడదు. తింటే విరేచనాలు కావడం పెరిగిపోతుంది. కొందరిలో రక్తం గడ్డలు కడుతుంది. వారు రక్తం పలుచన చేసేందుకు మందులను వాడుతున్నప్పుడు క్యాబేజీని తినకూడదు. ఎందుకంటే దీనిలో విటమిన కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అధికం చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)