టెస్లా కారుపై కోపంతో డైనమైట్లతో పేల్చేశాడు!

Telugu Lo Computer
0


ఫిన్లాండ్‌కు చెందిన టౌమస్ కెటెనిన్ ఎనిమిదేళ్లుగా టెస్లా కారును వాడుతున్నాడు. ఆ కారులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనేక ఎర్రర్ కోడ్‌లు వంటి సమస్యలను తాను ఎదుర్కొన్నానని చెబుతున్నాడు టౌమస్. ఆ కారును టెస్లా సర్వీస్ సెంటర్ కి పంపించినట్టు చెప్పాడు. ఒక నెల తరువాత టెస్లా మెకానిక్‌లు కారును రిపేర్ చేసేందుకు రూ.17 లక్షల రూపాయలు ఖర్చువుతుందని చెప్పారు. మొత్తం బ్యాటరీ ప్యాక్ నే మార్చాలని వారు తెలిపారు. దీంతో టౌమస్ కు చాలా కోపం వచ్చింది. రిపేరుకే అంత ఖర్చవుతుంటే ఇలాంటి కారు ఉంచుకోవడం అవసరమా అనిపించింది. అందులోనూ కారు వారంటీ కూడా ముగిసిపోయింది. దీంతో టెస్లా సంస్థపై అసంతృప్తిని తెలియజేసేందుకు కారును పేల్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిన్‌ల్యాండ్ లోని వాతావరణం మంచుతో కప్పుకుని ఉంటుంది. ఒక మారుమూల గ్రామానికి కారుని తీసుకెళ్లి అక్కడ పేల్చివేయాలని ప్లాన్ వేశాడు. ఆ విషయం ఒక యూట్యూబ్ ఛానెల్ వారికి తెలిసి వారు టౌమస్ అనుమతి తీసుకుని మొత్తం షూట్ చేశారు. కారును పిప్పి చేసేందుకు 30 కిలోల డైనమట్లను కొనుగోలు చేశాడు టౌమస్. వాటిని కారు చుట్టు పేర్చి ఎలన్ మస్క్ ముఖంతో ఓ బొమ్మను తయారుచేసి అందులో కూర్చోబెట్టాడు. ఆ కారును పేల్చి వేశాడు. తెల్లటి కారు నల్లటి పొగల మధ్య చెరకుపిప్పిలా మారిపోయింది. అసంతృప్తిని, కోపాన్ని ప్రదర్శించడంలో ఇది ఇతడి స్టైల్ అంటూ యూట్యూబ్ లో కామెంట్లు మొదలయ్యాయి . 

Post a Comment

0Comments

Post a Comment (0)