నరాల బలహీనత _ గృహ చిట్కా !

Telugu Lo Computer
0


నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలను చూస్తుంటాం. ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఆహారం లోపం వలన, ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా, వయస్సు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు. సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూఉంటారు. ఆలా మందులు వాడకుండా ఇంటిలోనే మంచి పోషక ఆహారం తీసుకోని ఈ నరాల బలహీనత నుండి బయట పడవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనలను పాటించాలి.  ఒక కప్పు అవిసే గింజలు, అరకప్పు బాదం పప్పు, 2 స్పూన్ల మిరియాలు, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని ప్రతి రోజు అరస్పూన్ పొడిని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగటం వలన నరాల బలహీనత తగ్గటమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలసట లేకుండా ఉంటుంది. సహజసిద్ధమైన పదార్ధాలు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Post a Comment

0Comments

Post a Comment (0)