ఆ పాత్రలు నాకు మైనస్ అయ్యాయి : ఉమాదేవి

Telugu Lo Computer
0


బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఉమాదేవి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం గమనార్హం. అయితే ఈమెకు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉమాదేవి యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఉమాదేవి కెరియర్ పరంగా దూసుకుపోతున్న సమయంలో ఆమె చేసిన కొన్ని పాత్రలు తన కెరియర్ కు మైనస్ కూడా అయ్యాయని చెప్పవచ్చు. నితిన్ హీరోగా నటించిన సై సినిమాలో ఈమె చేసిన వ్యాంపు క్యారెక్టర్ తన కెరీర్ కు మైనస్ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో మంచి అవకాశాలు వచ్చినా చివరికి అవకాశాలు తగ్గుతున్న క్రమంలో కుటుంబ పోషణను దృష్టిలో పెట్టుకుని ఉమాదేవి తప్పని పరిస్థితుల్లో అలాంటి పాత్రలలో నటించాల్సి వచ్చింది. తాజాగా బిగ్ బాస్ మూవీ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈమె రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. రాజమౌళి దర్శకత్వం వహించిన 'సై' సినిమాని తన భర్త రీసెంట్ గానే చూసారని ఈ సినిమాలో ఆ పాత్రలో నటించింది నువ్వేనా..? అంటూ అడిగారని చెప్పుకొచ్చారు. ఇటువంటి పాత్రలో నటించావేంటి..? నాకెప్పుడూ చెప్పలేదే..? అంటూ అడిగారట. ఆ సమయంలో క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్లే అలా నటించానని.. ఎలాంటి దురుద్దేశం లేదని తనకి చెప్పానని తెలిపింది. కానీ ఉమాదేవిని తన భర్త రెండు చివాట్లు తిట్టి.. ఇంకెప్పుడూ ఇలాంటి పాత్రలలో అవకాశం వచ్చినా సరే.. క్యారెక్టర్ డిమాండ్ చేసినా సరే చేయవద్దు అని హెచ్చరించారట. ఇక ఆ తర్వాత తనను బాగా అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మా ఇద్దరికీ ఇలా అర్ధం చేసుకునే గుణం ఉండడం వల్లే హ్యాపీ గా జీవితాన్ని కొనసాగిస్తున్నాము అంటూ ఉమాదేవి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)