ఈతను ఈజీగా నేర్చుకోవటం ఎలా?

Telugu Lo Computer
0


చిన్న వయస్సులో ఈత నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తుంది.. వయసు పెరిగాక ఈత నేర్చుకుంటే రాదు అని చాలామంది అంటుంటారు. కానీ అది తప్పు. ఈత నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే చాలు కచ్చితంగా నేర్చుకోవచ్చు. ఈత కొట్టటం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. అదేంటంటే నీటి సాంద్రత కన్నా మనిషి సాంద్రత తక్కువగా ఉంటుంది. దాంతో మనం నీటిపై తేలియాడుతూ ఈతకొడతాం. అయితే ఎప్పుడైతే ఈతకొట్టే వ్యక్తి నీరు తాగుతాడో నీటి సాంద్రతకు సమానంగా మనిషి సాంద్రత ఉంటుంది. దాంతో మునిగిపోతాడు. అందుకే ఈతకొట్టే వాళ్లు కచ్చితంగా నోరు, ముక్కు నీటికి పై భాగంలోనే ఉంచుతారు. నేర్చుకునే వాళ్లు కూడా తమ నోరు, ముక్కు నీటికి పై భాగంలోనే ఉండే విధంగా చూసుకోవాలి. ఇదే అసలైన ట్రిక్. అప్పుడే నీటిపై శరీరం తేలియాడుతూ ఉంటుంది. ఈత నేర్చుకోవాలి అనుకునేవాళ్లకి మొదట భయం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. నీటిని మింగకూడదు. చాలామంది ఈతకొట్టే సమయంలో భయంతోనే నీటిని మింగుతారు. అలా చేస్తే మునిగిపోతారు. భయపడకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నీటిలో 30 నుంచి 60 డిగ్రీల మధ్యలో ఒక కోణం ఏర్పడేలా ఉండి ఈత కొట్టాలి. ఆ సమయంలోనూ నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత వెనుక వైపు కాళ్లను ఆడించాలి. ముందు నుంచి చేతులతో నీటిని మన పొట్ట కిందకు వచ్చేలా తెచ్చుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే శరీరం బ్యాలెన్స్ అవుతుంది. దీంతో నీటిలో తేలుతారు. అయితే ఇలా చేయాలంటే శరీరం మొత్తం కదలాల్సి ఉంటుంది. కనుక మొదటిసారి ఈత కొట్టే వారికి బాగా శ్రమ అనిపించినట్లు అవుతుంది. కానీ నిరంతరం సాధన చేస్తే తేలికవుతుంది. జంతువులు, పశువులు కూడా నీటి పై భాగంలోనే వాటి ముక్కు, నోటిని ఉంచుతాయి. ఈత వచ్చిఉండటం ప్రతి మనిషికి చాలా అవసరం. నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెడుకొలస్ట్రాల్ కరుగుతుంది. దానివల్ల బరువుకూడా తగ్గవచ్చు. హాయిగా ఈతకొడుతుంటే మీ శరీరం, మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. ఈత వల్ల శరీరం మొత్తం కలుగుతుంది దాంతో శరీరం మొత్తానికి వ్యయామం అవుతంది. ఈత వల్ల గుండె, ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. సాధారణ వారితో పోలిస్తే స్మిమ్మింగ్ వచ్చిన వారిలో గుండెపోటు సమస్య తక్కువ. బీపీని తగ్గించి బ్లడ్ ఘగర్ ని నియంత్రించటంలో కూడా ఈత సహాయపడుతుందట.  నేర్చుకునే దశలోనే మనం చెరువులు, కొలనులు, బావుల్లో ప్రాక్టీస్ చేయటం మంచింది కాదు. మొదట పూల్స్ లో చేస్తే ఆ తర్వాత మెల్లి మెల్లిగా చిన్నచిన్న కొలనులో చేయటం ఆ తర్వాత నీరు లోతు ఎక్కువగా ఉన్న వాటిల్లో చేయటం చేయాలి. ఒకేసారి లోతు ఎక్కువగా ఉన్నవాటిల్లో చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

Post a Comment

0Comments

Post a Comment (0)