రేపటి నుండి ఆఫీస్‌కు రావాలి

Telugu Lo Computer
0


కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో.. ఆయా సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ 'విప్రో'.. తన ఉద్యోగులను సోమవారం నుంచి కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసులు పూర్తయినవారిని విధులకు అనుమతించనుంది. హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానంలో.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు ఆఫీస్‌ నుంచి పని చేయాలని సూచించింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. '18 నెలల అనంతరం.. మా ఉద్యోగులు సోమవారం నుంచి వారానికి రెండు రోజులపాటు ఆఫీస్‌కు రానున్నారు. రెండు డోసుల టీకా పూర్తయినవారు.. సురక్షితంగా వచ్చి వెళ్లేలా, వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. కార్యాలయాల ప్రాంగణంలో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్‌ సేఫ్టీ ప్రొటోకాల్స్‌పై రూపొందించిన వీడియోనూ జతపరిచారు. జులైనాటికి విప్రో ఉద్యోగుల్లో దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రిషద్‌ ప్రేమ్‌జీ ఇటీవల నిర్వహించిన సంస్థ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ఈ సంస్థకు ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)