జి.వరలక్ష్మి

Telugu Lo Computer
0


గరికపాటి వరలక్ష్మి  అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటీ మణి, గాయని నిర్మాత, దర్శకురాలు. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది. వరలక్ష్మి సెప్టెంబర్ 13, 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలైన రంగస్థల నటుల నాటక బృందాలలో నటించింది. వరలక్ష్మి సక్కుబాయి, రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు . బాలనటిగా బారిస్టర్ పార్వతీశం (1940) లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 4 దశాబ్దాలు చిత్ర సీమలో రాణించిన గొప్ప నటీమణి. ఈమె 1968 లో మూగజీవులు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయనకు రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది. వరలక్ష్మి 2006, నవంబర్ 26 న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)