విజయ్ రూపానీ రాజీనామా

Telugu Lo Computer
0


గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో బాధ్యతలు సమయానుకూలంగా మారుతుంటాయని అన్నారు. ''ఒక సాధారణ కార్యకర్త అయిన నాకు ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాను'' అని రూపానీ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ప్రత్యేక మార్గనిర్దేశనం లభించేదని చెప్పారు. ''గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు అవకాశం కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు'' అని రూపానీ అన్నారు. ''కొత్త నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో, సరికొత్త ఉత్సాహంతో గుజరాత్ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలి. ఈ ఉద్దేశ్యంతోనే నేను రాజీనామా చేశాను'' అని వెల్లడించారు. 2022 డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అడగ్గా రూపానీ స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ తాము నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని, రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీజేపీ మోదీ నాయకత్వంలోనే వెళ్తుందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)