వాక్-ఇన్-ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

Telugu Lo Computer
0



కేవలం ఇంటర్వ్యూ తోనే డైరెక్ట్‌గా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిరుద్యోగులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓ పెన్ స్కూలింగ్ తెలియజేసింది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ పోస్టులు ఫిల్ అప్ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన  భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు : సీనియర్ కన్సల్టెంట్ (ఆడిట్ & అకౌంట్స్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసే వారి విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎకనామిక్స్ లేదా అకౌంట్స్ లేదా కామర్స్ లేదా సీఏలో గ్రాడ్యుయేట్ ఉండాలి. ఏదేని ప్రభుత్వ రంగ సంస్థలో అకౌంట్స్ రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. కన్సల్టెంట్ (విజిలెన్స్) పోస్టు ఒకటి ఖాళీ ఉండగా, కన్సల్టెంట్ (యోగా అండ్ వెల్‌నెస్‌) పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. కన్సల్టెంట్ (మీడియా ఇంజినీర్) రెండు పోస్టులు ఖాళీగా ఉండగా, కన్సల్టెంట్ (సివిల్ ఇంజినీర్) పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఒకేషనల్) ఒక పోస్టు ఖాళీ ఉండగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టు ఒకటి ఖాళీ ఉంది. పోస్టులకు సంబంధించిన వివరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓ పెన్ స్కూలింగ్ వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)