ముజఫర్‌నగర్‌లో కిసాన్ మహాపంచాయత్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 September 2021

ముజఫర్‌నగర్‌లో కిసాన్ మహాపంచాయత్‌

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదే  లేదని రైతు సంఘాలు మరోసారి రుజువు చేశాయి. కొద్ది మంది రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారన్న కేంద్ర ఆరోపణలను రైతు సంఘాలు ఖండించాయి. పార్లమెంటు లో కూర్చున్న వారికి వినిపించేలా తమ గళాన్ని వినిపిస్తామని నొక్కి చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మహాపంచాయత్‌ కార్యక్రమానికి రైతులు పోటెత్తారు. పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు, సమీప ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. సభకు దాదాపు 15 రాష్ట్రాల నుంచి దాదాపు 300 రైతు సంఘాల కార్యకర్తలు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. అన్ని వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాల రైతులు తమ ఉద్యమానికి మద్దతిస్తున్నారనే విషయం ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైందని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా వెల్లడించింది. 

No comments:

Post a Comment