స్వలింగ సంపర్కుడిపై తాలిబన్ల సామూహిక అత్యాచారం

Telugu Lo Computer
0


అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన అనంతరం తాలిబన్ల అరాచకాల గురించి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైన ఆందోళనను తాలిబన్లు వాస్తవ రూపంలో చూపిస్తున్నారు. తాలిబన్ వ్యతిరేకులపై హత్యా బెదిరింపులు, మహిళలపై ఆంక్షలు, కర్ఫ్యూలు సహా అనేక రకాలుగా అఫ్ఘాన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగా, తాజాగా జరిగిన ఓ సంఘటన తాలిబన్ అరాచకానికి దుర్మార్గానికి అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ స్వలింగ సంపర్క వ్యక్తిని మాట్లాడదాం అని పిలిచి అతడిని తీవ్రంగా కొట్టి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్యులను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్న తాలిబన్లు.. నమ్మబలుకుతూ ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటి సభ్యులను మోసం చేస్తున్నారని ఎల్‌జీబీటీక్యూ+ కార్యకర్త నేమత్ సదాత్ ఆరోపించారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తూ 'నిన్ను కలవాలని ఉంది' అని తాము కూడా స్వలింగ సంపర్కులమేనని చెప్తూ స్వలింగ సంపర్కులపై దాడులకు దిగుతున్నారని, కొంత మందినైతే చంపేసి వారి శవాల్ని విసిరేస్తున్నట్లు నేమత్ సదాత్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రస్తుతం తాలిబన్లకు మంచి ఆయుధంగా మారిందని, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి ప్రజలను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వాపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)