పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్‌

Telugu Lo Computer
0

 

గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు అసోంలో పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్‌ రైలును ఆపివేశాడు. గౌహతి- హౌరా స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం హౌరాకు బయల్దేరింది. అసోంలోని చాయ్‌గావ్‌ స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే పైలెట్‌ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు ప్రకటించారు. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)