భర్తను చంపేసిన భార్య

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని  భిల్వారా జిల్లా బలపురాలో పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు దేవీసింగ్. అతని భార్య పింకీ. కాపురం సజావుగా సాగేది. ఏ సమస్యలూ లేవు. ఆగస్ట్ 22న ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్... ఉదయాన్నే బైక్‌పై వచ్చింది. దేవీసింగ్ ఇంటి తలుపులు తట్టింది. ఆవలిస్తూ తలుపులు తీస్తూ... ఎవరూ అన్నాడు. ఆ వచ్చిన ముగ్గురూ... ముఖాలు మొత్తం మాస్కులు ధరించారు. తలుపు తియ్యగానే... ఇంట్లోకి దూసుకెళ్లి... పింకీ చూస్తుండగానే... ఆమె భర్తను మెడపై కత్తి వేట్లతో కసాకసా నరికి చంపారు. పూర్తిగా చచ్చాడో లేదో క్లారటీ వచ్చే వరకూ ఆగి... ఆ తర్వాత బైక్‌పై పారిపోయారు. వాళ్ల చేతుల్లో రక్తం కారుతున్న కత్తులు చూసి స్థానికులు కళ్లు పెద్దవి చేశారు. ఇన్నాళ్లూ మాట్లాడుకోవడానికి ఏ టాపిక్కూ లేని ఆ ఊళ్లే... అదే హైలెట్ టాపిక్ అయ్యింది. అందరూ రక్త చరిత్ర రేంజ్‌లో దాని గురించి చెప్పుకున్నారు.  పోలీసులు రావడం శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించడం, భార్యను క్యాజువల్‌గా ప్రశ్నించడం అన్నీ జరిగాయి. దాణా వ్యాపారంలో 49 ఏళ్ల దేవీసింగ్‌కి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అనే డౌట్ వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చెయ్యగా... శత్రువులు లేరని తేలింది. మరైతే... ఆ రేంజ్‌లో ఎందుకు చంపారన్నది తేలలేదు. దాంతో పోలీసుల ఫోకస్ పింకీపై పడింది. ఆమెను మహిళా పోలీసులతో స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఆమె కళ్ల ముందే ఓ రౌడీని చితకబాది అతనితో వేరే కేసులో నిజం చెప్పించారు. అది చూసిన పింకీకి వెన్నులో వణుకొచ్చింది. నెక్ట్స్ నువ్వే అని ఓ మహిళా పోలీస్ చెప్పడంతో బాగా భయపడింది. ఆ తర్వాత ఆమెను ఇంటరాగేషన్ చేస్తే... అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పింది. దాంతో పోలీసులకు అసలు కథ ఇక్కడే ఉందని అర్థమైంది. పింకీ ముందు నాలుగు లాఠీలు పెట్టి... నిజం చెప్పమన్నారు. లాఠీలను చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. తన భర్తను తానే చంపించానని ఒప్పుకుంది. హత్య కోసం ముగ్గురు కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చానని కూడా చెప్పింది. మరైతే మర్డర్ ఎందుకు చేయించావని అడిగితే... మల్లెపూలు తేవడం మానేశాడని చెప్పింది. పోలీసులకు అర్థం కాలేదు... మల్లెపూలకూ మర్డర్‌కీ సంబంధం ఏంటని డౌట్ వచ్చింది. అప్పుడు పింకీ క్లారిటీగా చెప్పింది. తరచూ మల్లెపూలు తెచ్చి తనను సంతోషంగా చూసుకునే భర్తలో కొన్నాళ్లుగా మార్పు వచ్చింది. పూలు తేవడం మానేయడమే కాదు... ఇంటికి కూడా సరిగా రావట్లేదు. కారణమేంటంటే... వ్యాపారంలో పనులు ఎక్కువయ్యాయని, కొత్త రూల్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు. అది నమ్మని పింకీ... తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బలంగా నమ్మింది. దీనిపై ఆమె ప్రశ్నించిన ప్రతిసారీ తనను అనుమానించొద్దు అంటూ రివర్స్ అయ్యేవాడు. రాన్రానూ ఇద్దరి మధ్యా గ్యాప్ బాగా పెరిగింది. ఎంతలా అంటే... ఇక తన భర్తపై ఆమెకు ఏమాత్రం ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ స్థానంలో పగ చేరింది. తనను చీదరించుకునే భర్తను చంపేయడమే కరెక్ట్ అనుకునే స్థాయికి ఆ పగ చేరింది. పింకీ చెల్లెలి కూతురి భర్త కులదీప్ సింగ్. అతన్ని పిలిచి మర్డర్ స్కెచ్ వేసింది. ఆ కులదీప్ మరో ఇద్దర్ని వేసుకొచ్చాడు. ముగ్గురూ ఫలానా తేదీన వచ్చి ఎలా మర్డర్ చెయ్యాలో ప్లాన్ వేసుకున్నారు. అదే విధంగా ఆగస్ట్ 22న ప్లాన్ అమలు చేశారు. దేవీసింగ్‌ను నరికేసి వాళ్లు వెళ్లబోతుంటే... పింకీ వాళ్లను ఆగమంది. పూర్తిగా చచ్చేవరకూ ఆగి అప్పుడు వెళ్లమంది. వాళ్లు అదే చేశారు. ఆ తర్వాత శవంపై పడి బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. డ్రామా బాగా పండింది. ఊళ్లో అంతా నమ్మేశారు. పోలీసులూ మొదట నమ్మారు. తర్వాత కనిపెట్టారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ పరారీలో ఉన్నారు. వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ వివాహేతర సంబంధం ఉందా లేదా అన్నది పోలీసులు అప్పుడే చెప్పలేం అన్నారు. ఈ కేసులో భర్తకు విడాకులు ఇచ్చేసి ఉంటే... పింకీ తన బతుకేదో తాను బతికేది. అతని జీవితం అతను జీవించేవాడు. అలా చెయ్యకుండా అతన్ని చంపేసి జైలుపాలైంది. అంతేకాదు మరో ముగ్గుర్ని కూడా హంతకులుగా మార్చింది. అటు దేవీసింగ్ ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)