పెరుగు ఎందుకు ఇష్టం ?

Telugu Lo Computer
0



వెన్నల లో వున్నది  అమృతము యొక్క రసము అని - ఆ రసము పాలను  - పెరుగుగా  మారుస్తూ వున్నదని  - మన పూర్వీకులనమ్మకము . 

శ్రీ కృష్ణుడు -  గోవు పాలను పిండుతూ - ఆ క్షీరములో - చంద్రుని చూసి - నీలాప నిందల పాలైనాడని మనకొక కథ వున్నది. దీన్ని బాగా విశ్లేషిస్తే - కుండలోకి పాలు పిండుతున్నప్పుడు - అందులోనికి చంద్రుని వెన్నెలను పడేట్లు చూడటం భారతీయ సంప్రదాయాలలో ఒకటని తెలుసుకోవచ్చు .  కృష్ణుఁడు ఆ సంప్రదాయాన్ని అనుసరించి పాల కుండలోకి - వెన్నెల పడేట్లు గా కూచుని - పాలు పితికాడు . పాలు పితుకుతూ వున్నప్పుడు కుండలోకి చూడ కుండా పని కానివ్వ వచ్చు .  కానీ కృష్ణుడు పొరపాటున చూసాడు .

వెన్నెలయొక్క రసము " సోమము " అనేక ఆయుర్వేద మొక్కలకి ఔషధ గుణము ఇస్తున్నది . అల్లాగే పాలలో పడ్డ వెన్నెల - పాలకు ఔషధగుణము - పెరుగుకు అమృత గుణము కలిగిస్తున్నదని భావించారు. అమృతము అంటే మృత్యువును దరికి రానివ్వనిది  అని ఒక అర్ధం వుంది . 

పై కారణం చేత పెరుగును ఒక - తప్పని సరి ఆహారంగా ఆంధ్రులు స్వీకరించారు . ఎన్నో సంప్రదాయాలు అంత రించినా - ఇది మాత్రం - ఒక తరం నండీ ఒకతరానికి - ఎటువంటి - అవాంతరం లేకుండా - వెంట  నడిచి వచ్చింది . 

ఆఖరి దెబ్బా కాకర కాయా - ఏమిటంటే ?? తిన్నన్ని నాళ్ళు - మసాలాలు , బిర్యానీలు - చికెన్లు తిని - నలభై దాటగానే - పెరుగన్నం మాత్రమే ఇష్టపడే వారిని - అనేకులను  చూస్తూనే వున్నాం .

వారు అనారోగ్యాన్ని - మృత్యు భయాన్ని - పెరుగు - అన్నం తినటం ద్వారా జయిస్తూ వున్నారు . 

వెన్నల లో వున్నది  అమృతము యొక్క రసము అని - ఆ రసము పాలను  - పెరుగుగా  మారుస్తూ వున్నదని  - మన పూర్వీకులు ఒక వూహ చేయటం - అది మన మనస్సుకు ఎక్కటం వల్ల - పెరుగు ఆంధ్రుల పాలిట అమృతంగా ను - అంతకన్నా ఎక్కువగా కూడా అయ్యింది . 

బాక్తీరియా - పాలను పెరుగు గా మారుస్తుంది . కానీ ఒక సొగసైన వూహ తరతరాలు ను ప్రభావితం  చేసింది .

Post a Comment

0Comments

Post a Comment (0)