సామెతలు...!

Telugu Lo Computer
0


* ఉడకక ఉడకక ఓ ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు !

*  మొండికెక్కిన దాన్ని మొగుడేమి చేసి రచ్చకెక్కినా దాన్ని రాజేమిచేసు !

* వాడ వదినెలకేల వావివరసలు !

*  కందకు లేని దురద బచ్చలికేమి !

* కాలు పట్టుకు లాగితే చూరు పట్టుకు వేలాడేడు ! 

* మెడపట్టుకు గెంటితే చూరు పట్టుకు వేలాడిందట!

* దొంగ చిక్కెనోయి అంటే కరిచెనోయి అన్నట్టు- కరవకురా దొంగడా!

* కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట.

* నంగివంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేశాయి అన్నాడుట !

* మెసలి బావా కడిమి వేరాయెగాని కాలయినా ఇంతే కదా !

* ఇనుము విరిగితే అతకవచ్చునుగాని మనసు విరిగితే అతక కూడదు !

* పుట్టడం చావడం కొరకే, పెరుగుట విరుగుట కొరకే !

* చెరువు నిండితే కప్పలు చేరుతాయి !

* కమ్మనీచు కడిగినాపోదు, కాకినలుపు చిప్పపెట్టి గోకినాపోదు !

*  వైదికపు పిల్లీ వ్రత్తి పలకవే అంటే మావు మావు అందిట !

Post a Comment

0Comments

Post a Comment (0)