ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాకు సిద్ధం ?

Telugu Lo Computer
0


ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు లేఖ రాశారు.రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితులను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో మార్చి 10న తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖాండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయానికి తీరత్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. రాజ్యాంగం ప్రకారం.. సీఎం పదవిలో కొనసాగాలంటే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచైనా లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అయినా ఎన్నిక కావాలి. ఉత్తరాఖాండ్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ లేనే లేదు. సెప్టెంబర్ 10లోగా ఉత్తరాఖాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి బై ఎలక్షన్ లో అయినా కచ్చితంగా గెలవాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)