ఎయిర్ పిస్టల్ లో ఫైనల్‌ కు సౌరభ్

Telugu Lo Computer
0


జపాన్ లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో  భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 586 పాయింట్లతో సౌరభ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో భారత షూటర్ అభిషేక్ వర్మ అర్హత సాధించలేకపోయాడు. 575 పాయింట్లతో అభిషేక్ వర్మ 17వ స్థానంలో నిలిచాడు.ఆర్చరీలో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ కు చెందిన క్రీడాకారులు దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ లు ఫైనల్ కు అర్హత సాధించారు. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది. ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీలకు చెందిన లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్‌ను దీపికా కుమారి, జాదవ్ కలిసి ఓడించారు. ఫైనల్ కు చేరుకున్నారు. ఆర్చరీలో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ మంచి ప్రతిభను కనబరిచింది. కానీ టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్ జోడీ ఓటమి పాలైంది. చైనీస్ తైపీ చేతిలో శరత్ కుమార్, మనికా బత్రా ఓటమిపాలయ్యారు. 4-0 తేడాతో భారత్‌పై చైనీస్ తైపీ విజయం సాధించింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్‌తో హర్మన్‌ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)