సామెతలు ...!

Telugu Lo Computer
0



* ఆంబోతులా పడి మేస్తున్నావు !

* ఆంతా ఆతాను ముక్కే !

* ఆ మొద్దు లోదే ఈ పేడు !

* ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు !

* ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట !

* ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...!

* ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట !

* ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...!

* ఆడబోయిన తీర్థమెదురైనట్లు !

* ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు !

* ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట !

* ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు !

* ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు !

* ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి !

* ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె !

* ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట !

Post a Comment

0Comments

Post a Comment (0)