థర్డ్ వేవ్ : తస్మాత్ జాగ్రత్త !

Telugu Lo Computer
0

కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలోనే.. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిన్నారులకు ఎలాంటి టీకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో పిల్లలు ఇప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సరైన పోషకాహారాన్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. 
ఈ మహమ్మారి లక్షలాది  మందిని బలితీసుకోవడమే కాకుండా, 
చాలా కుటుంబాల బ్రతుకులను  చీకట్లోకి నెట్టింది. 

పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేరెడు పండు మంచిది. ఈ పండు కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. దీనిని పిల్లలకు ఇవ్వడం ద్వారా మంచి గట్ బ్యాక్టీరియాస పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇదే కాకుండా.. పిల్లలకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. రోటీ, నెయ్యి మరియు బెల్లం రోల్ లేదా సుజీ హల్వా లేదా రాగి లడ్డూ వంటి తీపి ఆహారాన్ని ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. పిల్లలకు ఎక్కువగా అన్నం తినిపించాలి. ఎందుకంటే బియ్యంలో ప్రత్యేకమైన ఆమ్లం ఉంటుంది. పప్పు, బియ్యం, నెయ్యి కలిసిన ఆహారాన్ని పిల్లలకు అందించడం మంచిది. అలాగే కూరగాయలతో చేసిన పచ్చళ్లు కూడా మంచివే. ఇవి గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహయపడుతుంది. అలాగే వారికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. వీటితోపాటు జీడిపప్పు కూడా చాలా మంచిది. ఇది వారికి కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందిస్తోంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)