వైద్యుడిపై దాడి

Telugu Lo Computer
0


కరోనా తో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తి అసోంలోని హోజాయ్‌ జిల్లాలోని ఉడాలి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు  వైద్యుడి   నిర్లక్ష్యం వలనే  మృతి చెందాడని   వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. డాక్టరుపై దాడిని మరో డాక్టర్ వీడియో తీసి ముఖ్యమంత్రితో పాటు ప్రధాని మంత్రి కార్యాలయానికి ట్విట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు 24 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్‌ చేశారు. దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 

అయితే, డాక్టర్‌ కుమార్‌ సేనాపతి ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసి, సర్వీసులో చేరిన మొదటి రోజే దాడి జరిగింది. 

వైద్యుడిపై దాడి ఘటనను ఐఎంఏ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)