పే షెం ట్ !.....

Telugu Lo Computer
0


ఒక పేషెంట్ రీ చెక్ అప్ కు వచ్చింది. ఆమె వయస్సు  40 ఏళ్ళు. 

"షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా  ?" అనడిగాను.  

"అస్సలు మానలేదండీ ! మీరు చెప్పినట్లే వేసుకుంటున్నాను.  ఆహార  విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నానండీ !"

తీరా చుస్తే షుగరు 376 % ఉంది.

"నాకు అనుమానం ఏమీ అనిపించలా  ! ఎక్కడో ఆహారంలోనే తేడా వచ్చిందని !!"

ప్రశ్నించగా, ప్రశ్నించగా తేలిందేమంటే మామిడి పళ్ళు రోజుకి నాలుగు ఐదు చొప్పున వారం రోజులుగా తింటున్నదట!. 

"మరి ఇకనేం ? అందుకే అంతగా పెరిగింది. ఎక్కువగా గుజ్జు ఉన్న పళ్ళు తినద్దని చెప్పాను కదా?"

"కానీ డాక్టర్ గారూ  ! అవి చెట్టు పళ్ళండీ !"

"ఆహాఁ ! చెట్టుకి కాకుండా ఫాక్టరీల్లో తయారౌతాయా ఏమిటి ?" వెటకారం ఆపుకుందామనుకున్నా ఆగలేదు.

"మా పెరటి చెట్టండీ !"

"అయితే ?"

"మందులేమీ వెయ్యకుండా పెంచామండీ ! పౌడర్ వెయ్యకుండా గడ్డిలో పరిచి పండబెట్టామండీ  " 

"ఐతే ఏమిటటా  ?"

"ఇంట్లో సహజంగా పండించిన పళ్ళు తింటే షుగర్ పెరగదని వాట్సాప్ లో మెసేజి పెట్టారండీ మూణ్ణెల్ల క్రితం  !"

హా ! ఢ్డామ్ మ్ మ్ మ్ !

డాక్టర్ గారూ, డాక్టర్ గారూ ! ఏమైందండీ ??

Post a Comment

0Comments

Post a Comment (0)