సూర్యుడి చుట్టూ వలయం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో సూర్యుడి చుట్టూ ఒక వలయం కనిపించింది. ప్రజలు దీన్ని ఆశ్చర్యంతో వీక్షించారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ్ బీబీసీతో మాట్లాడుతూ- రుతుపవనాల సమయంలో ఇలా జరుగుతుందని తెలిపారు. “రుతుపవనాల సమయంలో ఆకాశంలో చాలా ఎత్తులో పలుచని, వలయాకారపు మేఘాలుంటాయి. వీటిని సిర్రస్‌ క్లౌడ్స్‌ అంటారు. ఈ మేఘాల్లో మంచు స్ఫటికాలు ఉంటాయి. ఆ మంచు అంతా ఓ వరుసలోకి వచ్చినప్పుడు ఇలా వలయంలా ఏర్పడుతుంది. ఇది కూడా ఇంద్ర ధనుస్సు ఏర్పడటంలాంటిదే. కాకపోతే దీనిలో ఒక రంగు మాత్రమే ఉంటుంది” అని సిద్ధార్థ్‌ వివరించారు. ఒక్కోసారి ఈ సిర్రస్‌ మేఘాలు ఎంత పలుచగా ఉంటాయంటే, అవి ఉన్నట్లు మనం గుర్తించలేము. ఆ మేఘాలు సూర్యుడి ముందు నుంచి వెళ్లినప్పుడు సూర్య కాంతి.. మేఘాల్లోని మంచుపై పడి పరావర్తనం చెంది, ఇలా వలయం ఏర్పడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)