పేటీఎం భారీ ఐపిఓ

Telugu Lo Computer
0


పేటీఎం తన వ్యాపారాన్ని భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి  తెర తీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, దాదాపు మూడు  బిలియన్  డాలర్లు అన్నమాట. దేశంలో ఒక కంపెనీ మొట్ట మొదటిసారే ఇంత భారీ ఎత్తున ఐపీఓకి వెళ్లడం ఇదే ప్రథమమని  మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 

2010లో కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రూ.15,000 కోట్లకుపైగా మొత్తాన్ని ఐపీఓ ద్వారా సమకూర్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఒక కంపెనీ ఐపీఓకి వెళ్లడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థికంగా బర్క్‌షైర్ ఇన్‌కార్పొరేషన్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, యాంట్ గ్రూప్ కార్ప్ వంటి కార్పొరేట్ దిగ్గజాల సపోర్ట్ ఉన్న పేటీఎం ఐపీఓ ప్లాన్స్ విషయంలో ప్రస్తుతానికి గోప్యతను పాటిస్తోంది. సంస్థాగతంగా రహస్యంగా ఉన్న పేటీఎం ఐపీఓ మ్యాటర్స్‌ని ఈ డీల్ గురించి తెలిసిన సన్నిహిత వ్యక్తులు మీడియాకు వెల్లడించడంతో అసలు విషయం బయటకు పొక్కినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)