ఓడితే ప్రపంచం ఆగిపోదు : కోహ్లీ

Telugu Lo Computer
0


ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఓ సాధారణ టెస్ట్‌ మ్యాచ్‌ మాత్రమేనని, ఇందులో టీమిండియా గెలిచినా.. ఓడినా క్రికెట్‌లో కొనసాగక తప్పదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు.  కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవ్వరూ ప్రపంచ ఛాంపియన్లు కాలేరని, ఐదు రోజుల ఆట ఆధారంగా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ను డిసైడ్‌ చేయడం తప్పని  ఆయన అభిప్రాయపడ్డారు. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయావకాశాలపై స్పందించాడు.

క్రికెట్‌ కూడా ఇతర క్రీడల్లాంటిదేనని, ఇందులోనూ గెలుపోటములు సాధారణమేనని పేర్కొన్నాడు. టీమిండియా ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా, మా క్రికెట్‌ ఇక్కడితో ఆగిపోదని,  అందుకే ఈ మ్యాచ్‌ను మరీ ప్రత్యేకంగా చూడనవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌లో గతకొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తుందని, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా తమ ఫామ్‌ను అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టు సభ్యులంతా కుర్రాలని, నాటి ఆ ఫైనల్‌ మ్యాచ్‌తో పోలిస్తే ఇది మరీ అంత ముఖ్యమైందేమీ కాదని వెల్లడించాడు.

ఇక సౌథాంప్టన్‌లో వాతావరణం తమ జట్టు కూర్పుపై ప్రభావం చేపలేదని, అన్ని విభాగాల్లో సమతూకాన్ని మెయింటైన్‌ చేసి, పటిష్ఠమైన జట్టుతో బరిలోకి దింపుతున్నామని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులంతా ఎంతో హుషారుగా ఉన్నారని, ఇదే ఊపులో చక్కగా రాణించాలని ఆశిస్తున్నారని తెలిపాడు. ఫైనల్‌ చేరేందుకు మేమెంత కష్టపడ్డామో అందరు గమనించారని, అయితే అసలు సిసలైన పరీక్ష మాత్రం ముందుందని చెప్పుకొచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)