పండు వెయ్యి !

Telugu Lo Computer
0



పండ్లలో రారాజు మామిడి పండు అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ‘నూర్జాహాన్‌’ రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారు.  అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు.

కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ మాట్లాడుతూ "నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. అయితే ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది." అని తెలిపారు .

Post a Comment

0Comments

Post a Comment (0)