సుప్రీంకోర్టులో భేషరతుగా క్షమాపణలు చెప్పిన రాందేవ్ !

Telugu Lo Computer
0


ధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి వస్తువుల్లో వ్యాధి, రోగ నిరోధక శక్తి ఉంటుందంటూ ప్రచారం చేసిన యోగా గురు రాందేవ్ బాబా సుప్రీంకోర్టులో భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆధునిక వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తూ.. పతంజలి ప్రాడక్ట్స్ ప్రకటనలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత.. రాందేవ్ కోర్టుకు హాజరుకావాలని లేకపోతే తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే 2024, ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టుకు రాందేవ్ హాజరయ్యారు. దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. పతంజలి సరుకును మార్కెటింగ్ చేసే సమయంలో.. తప్పుడు ప్రకటనలు ఇచ్చినట్లు అంగీకరించారు. కరోనా సమయంలో అల్లోపతి కంటే పతంజలి మందులు వాడితే కరోనా రాదు అన్నట్లు ఆయన ప్రచారం చేయటాన్ని తప్పుబట్టింది కోర్టు. పతంజలి ఉత్పత్తుల్లో వ్యాధులను నయం చేసేటువంటి మందులు లేవని అంగీకరిస్తూ.. సుప్రీంకోర్టులో రాందేవ్ బేషరతు క్షమాపణలు చెప్పారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం 1954 కింద.. రోగాలకు చికిత్స చేస్తామంటూ ప్రచారం చేస్తున్న అన్ని పతంజలి ఉత్పత్తుల అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.



Post a Comment

0Comments

Post a Comment (0)