ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని తన నరేంద్ర మోడీ  తన పదవిని వాడుకుంటూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీ తరపున ప్రచారం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వ వనరులను ఉపయోగిస్తే ఆ బిల్లులను బీజేపీ నుంచి ఈసీ వసూలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ విమానాన్ని ప్రధాని తన పర్యటనలకు ఉపయోగిస్తే అందుకు అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను బీజేపీకి పంపి ఆ పార్టీ నుంచి ఈసీ వసూలు చేయాలని రౌత్ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ ప్రభుత్వ హెలికాఫ్టర్లలో వెళుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని ఇటీవల ముంబై పర్యటనకు వచ్చారని, గౌతం అదానీకి కట్టబెట్టేందుకు భూమిని వెతికేందుకే ఆయన నగరానికి వచ్చారని రౌత్ వ్యాఖ్యానించారు. ధారావి పునర్మిర్మాణ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారని అన్నారు. ముంబైలో ప్రధాని మోడీ ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా నగర ప్రజలు బీజేపీని ముంబై నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని రౌత్ స్పష్ఠం చేశారు. బీజేపీకి ముంబైలో ఒక్క సీటు కూడా దక్కదని, తన మాటలను రాసిపెట్టుకోవాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)